యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తండేల్ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి చైతూ కెరీర్‌లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఇక, విడుదలైన 9 రోజుల నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్‌ను దాటింది.