సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అచ్చంపేట డివిజన్ అధ్యక్షుడు రేసోజు సాయిబాబు తీవ్రంగా ఖండించారు. విశ్లేషకుడి మాటలను 'సాక్షి' మీడియా ఖండించినప్పటికీ అరెస్ట్ చేశారన్నారు. 70 ఏళ్ల కొమ్మినేనిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి టాక్ షోలు చేసే వారు అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని కొమ్మినేనిపై పెట్టి నట్టు వారందరిపైనా అక్రమ కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు.