నల్లమల ప్రాంతంలోని పురాతన శివాలయాలు, దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం మండలంలోని అంతర్గంగా దేవాలయాన్ని ఆయన సందర్శించి పూజలు నిర్వహించారు. నల్లమల ప్రాంతంలోని దేవాలయాలను అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. పూజలకు నోచుకోని దేవాలయాలను పూర్వం తీసుకొచ్చి ప్రభుత్వపరంగా అభివృద్ధి చేస్తానన్నారు.