అచ్చంపేట: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

60చూసినవారు
అచ్చంపేట: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బుధవారం సీపీఐఎం జిల్లా కమిటీ సభ్యుడు దేశ్యనాయక్ డిమాండ్ చేశారు. రైతులకు రైతు భరోసా, రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ అచ్చంపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఇప్పటికీ అనేకమందికి అందలేదని దేశ్యనాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఐఎం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్