పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అచ్చంపేట మున్సిపల్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ గణేశ్ సూచించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జూబ్లీ నగర్లో డ్రైడే నిర్వహించారు. అంతర్గత రోడ్ల పైన ఉన్న చెత్తను సిబ్బందితో శుభ్రం చేయించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. దోమలు వ్యాప్తి చెందకుండా మందులు పిచికారి చేశారు.