బల్మూరు: మైనింగ్ పనులను నిలిపివేయాలి

73చూసినవారు
బల్మూరు: మైనింగ్ పనులను నిలిపివేయాలి
బల్మూరు మండలం మైలారం గ్రామంలో శుక్రవారం సీపీఐ నాయకులు సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ మాట్లాడుతూ మైలారం గ్రామంలో కొనసాగుతున్న మైనింగ్ పనులను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైనింగ్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. మైనింగ్ పనులను ఆపకపోతే తీవ్రంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్