ప్రజా రవాణాలో ప్రయాణిస్తూ చదువుకునే విద్యార్థుల బస్ చార్జీలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గాప్రసాద్ కల్వకుర్తిలో గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే బస్ పాస్ చార్జీలు ఆకాశానంటాయని, ఫ్రీ బస్ పథకం ద్వారా సరిపడా బస్సులు లేక విద్యార్థులు ఫుట్ పాత్ పై ప్రయాణం కొనసాగిస్తున్నారన్నారు. పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.