అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. ఒకేసారి టికెట్ ధర 130 రూపాయలు పెంచారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. రోజు హైదరాబాద్ కు ప్రయాణికులను చేరవేసే సాధారణ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ చార్జీల బాదుడు ప్రయాణికులకు దడ పుట్టిస్తుంది. గురువారం వరకు అచ్చంపేట నుంచి హైదరాబాద్కు 220 రూపాయల టికెట్ ఉండగా శనివారం 330 రూపాయలకు పెరిగింది.