వంగూరు మండల కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైన మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఓ వ్యాపార సంస్థ అందజేసిన టీషర్టులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యాపార సంస్థ ప్రతినిధులను వంశీకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాపార సంస్థ ప్రతినిధులు మీసాల స్వామి, నాగేష్ యాదవ్, జంగయ్య, చింతకుంట్ల నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.