పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో ఆదివారం రాత్రి సీపీఎం పార్టీ కల్వకోలు గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్ద కొత్తపల్లి మండలం సిపిఎం మండల కార్యదర్శి దశరథం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో అనేక సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని అన్నారు. వీటిపై రాబోయే రోజుల్లో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎల్లయ్య, రాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.