వంగూరు: కనీస వసతులు లేక కూలీలకు ఇబ్బందులు

67చూసినవారు
వంగూరు: కనీస వసతులు లేక కూలీలకు ఇబ్బందులు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉప్పల్ పహాడ్ గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి. బాలస్వామి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలకు పని ప్రదేశంలో కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేక ఎండకు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రోజుకు 600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్