నాగర్ కర్నూల్: న్యాయ సేవ వాల్ పోస్టర్ ను విడుదల చేసిన జడ్జి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా న్యాయమూర్తి రాజేష్ న్యాయ సేవ వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రజలు ఎవరికైనా ఇప్పుడైనా ఆపద సంభవిస్తే 15100 నెంబర్ కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి సబిత, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.