రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన సర్వే తప్పుడు లెక్కలతో ఉందని గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు ఆరోపించారు. బీసీల జనాభా తగ్గించి చూపడం దారుణం అన్నారు. 42% రిజర్వేషన్ అమలు చేయాలని, కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బుధవారం ఆయన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.