తిప్పారెడ్డిపల్లిలో అంగన్వాడీ బాట కార్యక్రమం

83చూసినవారు
తిప్పారెడ్డిపల్లిలో అంగన్వాడీ బాట కార్యక్రమం
వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అమ్మఒడి అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడి కేంద్రాన్ని మామిడి తోరణాలతో అలంకరించారు. అంగన్వాడి కేంద్రం ఆవరణలో రంగవల్లులను వేశారు. అంగన్వాడి కేంద్రంలో చేరుతున్న విద్యార్థులకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కె. లితమ్మ, ఆయా శాంతమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్