కల్వకుర్తి బిజెపి నియోజకవర్గ సమావేశం శుక్రవారం అమన్ గల్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి హాజరై మాట్లాడుతూ బిజెపి సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు మొగిలి దుర్గాప్రసాద్. కాండే హరి ప్రసాద్, రాఘవేందర్ గౌడ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.