జనవరి 22న జరగబోయే అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శుక్రవారం అయోధ్య శ్రీరాముడి అక్షింతలను మరియు కరపత్రాలను కల్వకుర్తి గాంధీనగర్ 22వ వార్డులో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ హిందువుల 500 సంవత్సరాల కల నెరవేరబోతున్న సందర్భంగా దేశం మొత్తం హిందువులు పండుగ వాతావరణం నెలకొందని ఆన్నారు.