కల్వకుర్తి: బీసీ కులగణనలో రాజకీయ కుట్రను తిప్పికొడతాం

50చూసినవారు
కల్వకుర్తి: బీసీ కులగణనలో రాజకీయ కుట్రను తిప్పికొడతాం
బీసీ కులగణన వివరాలను పర్యవేక్షించి చుస్తే ఇది బీసీల కోసం చేసిన సర్వే కాదని ఇతర ముస్లిం మైనార్టీలను ఇతర మతస్తులను బీసీలుగా చిత్రీకరించే సర్వేగా అర్ధమవుతుందని కల్వకుర్తి బీజేపీ బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవి గౌడ్ మంగళవారం  ఒక ప్రకటనలో ఆరోపించారు. బీసీల జనాభాను తక్కువ చూపించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, కులగణన సర్వే పారదర్శకంగా చేయలేదని కేవలం మొక్కుబడిగా మాత్రమే చేశారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్