కల్వకుర్తి బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మహబూబు నగర్ చౌరస్తాతో పాటు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోడ నరసింహ, బాబీ దేవ్, మట్టనరేష్ గౌడ్, రవి గౌడ్, శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.