హనుమాన్ జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో శనివారం రాత్రి నిర్వహించిన శోభాయాత్రతో కల్వకుర్తి పట్టణం దద్దరిల్లింది. హనుమాన్ దేవాలయం నుండి పట్టణంలోని పురవీధుల గుండా నిర్వహించిన శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, నరసింహ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఆంజనేయులు, గిరిధర్ రెడ్డి పెద్ద ఎత్తున యువత పాల్గొని నృత్యాలతో అలరించారు.