నాగర్ కర్నూల్: మజ్జిగ పంపిణీని ప్రారంభించిన సేవా బృందం

66చూసినవారు
నాగర్ కర్నూల్: మజ్జిగ పంపిణీని ప్రారంభించిన సేవా బృందం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం వివేకానంద సేవ బృందం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవ బృందం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ శివకుమార్ మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రయాణికులకు దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్