నాగర్ కర్నూల్ జిల్లా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ యూనియన్ శుక్రవారం ఆవిర్భవించింది. ఈ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా రామావత్ రాజా ఉపాధ్యక్షుడిగా ఎం. అనిత, ప్రధాన కార్యదర్శిగా రవీందర్, మీడియా కన్వీనర్ గా ఎం. శ్రీను ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పాల్గొన్నారు.