కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్బంగా ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమలు బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా సేవా బృందం అధ్యక్షుడు శివ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని పలు పాఠశాలలో 8, 9, 10వ తరగతి విద్యార్థులు సైకిల్లకు బదులుగా ద్విచక్ర వాహనాలు పాఠశాలలకు తీసుకెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్న దానిపై అవగాహన సదస్సు నిర్వహించారు.