వంగూర్ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మూడావత్ లక్ష్మణ్ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మరణించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తిరుమలగిరి గ్రామంలో మృతుడు లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మణ్ మృతి బాధాకరమని అన్నారు. కుటుంబ సభ్యులకు 20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కడారి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.