కల్వకుర్తి: బీజేపీ విజయంతో బాణాసంచాలు కాల్చిన నాయకులు
దేశంలో జరిగిన ఉప ఎన్నికలతో పాటు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మీ నరసింహ (చింటూ) ఆధ్వర్యంలో శనివారం కల్వకుర్తి గాంధీనగర్ లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకూర రవి గౌడు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.