పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో రమేష్ కుమార్ అన్నారు. బుధవారం వంగూరు, ఉప్పునూతల మండలాల్లోని వంగూర్, డిండిచింతపల్లి, నిజామాబాద్, ఉప్పునూతల పిరత్వానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను, ప్రాథమిక పాఠశాలలను డిఇఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలో పదో తరగతి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు.