కొల్లాపూర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో కోడేరు వీపనగండ్ల కొల్లాపూర్ మండలాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.