రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నేపథ్యంలో గురువారం ఉదయం కేజీబీవీ పాన్‌గల్ సందర్శించి, పదవ తరగతి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు మండల విద్యాధికారి బి శ్రీనివాస్. అనంతరం విద్యార్థులతో సబ్జెక్టు వారిగా చర్చిస్తూ మంచి ఫలితాలు సాధించేందుకు అవసరమైన మెలుకువలపై సూచనలు చేశారు. అనంతరం యండమూరి వీరేంద్రనాథ్ వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు విద్యార్థులకు అందజేశారు.