నిజామాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులకు అత్యంత ప్రాధాన్యమైన అంశం సాగునీరు కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల పురోగతిపై నివేదికలు అందించాలని సూచించారు. ప్రాజెక్టుల పనులు, బడ్జెట్, అనుమతులపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. ఉన్నతాధికారులు పాల్గొన్నారు.