కొల్లాపూర్: సోమశిల క్షేత్రంలో పర్యాటకులకు మౌలిక వసతులు కల్పిస్తాం
కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామాన్ని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం సందర్శించారు. సోమశిల ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో భక్తులకు అనుగుణంగా వెంటనే మౌలిక వసతులు కల్పించే విధంగా పనులు ప్రారంభించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహను, కొల్లాపూర్ మండల పంచాయతీ రాజ్ ఏఈ సాయిరాంని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.