కొల్లాపూర్: బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని డీఎంకు వినతి
కొల్లాపూర్ లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆస్పత్రి ఎదుట బస్ స్టాఫ్ ఏర్పాటు చేయాలని కేవీపీఎస్ మండల కార్యదర్శి బత్తిని రాజు కోరారు. గురువారం కొల్లాపూర్ ఆర్టీసీ డీఎం ఉమాశంకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. బస్ స్టాఫ్ లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చే గర్భి ణులు, ఆస్పత్రి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ్, కార్తీక్, సాయి, రైతు సంఘం మండల కార్యదర్శి బాలపీరు ఉన్నారు.