అచ్చంపేట బస్సు డిపో దగ్గర ప్రైవేట్ బస్సు డ్రైవర్లు బుధవారం సిఐటియు నాయకులు రాములు ఆధ్వర్యంలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు నల్ల బ్యాడ్జీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాములు మాట్లాడుతూ ప్రైవేటు బస్సుల యజమానులు డ్రైవర్ల హక్కులను కాల రాస్తున్నారని మండిపడ్డారు. డ్రైవర్ల వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. పెంచే వరకు బస్సులు కదలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు బస్సుల డ్రైవర్లు పాల్గొన్నారు.