సీబీఎస్ఈ సిలబస్ అని బోర్డులు పెట్టుకున్న స్కూళ్లపై చర్యలు

62చూసినవారు
సీబీఎస్ఈ సిలబస్ అని బోర్డులు పెట్టుకున్న స్కూళ్లపై చర్యలు
సీబీఎస్ఈ సిలబస్ అని ప్రభుత్వ అనుమతులు లేకున్నా బోర్డులు పెట్టిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్ యు రాష్ట్ర నాయకులు సంతోష్ డిమాండ్ చేశారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని కొన్ని పాఠశాలలలో అనుమతులు లేకున్నా సీబీఎస్ఈ సిలబస్ అని బోర్డులు పెట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్