వంగూర్ మండలం పోల్కంపల్లి గ్రామంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంపై ఉదయం 10 గంటలకు అవగాహన సదస్సు జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రియదర్శిని మంగళవారం తెలిపారు. ఈ అవగాహన సదస్సును రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సుకు మండలంలోని రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.