సాతాపూర్ లో జిల్లా స్థాయి కబడ్డీ ప్రారంభం

76చూసినవారు
సాతాపూర్ లో జిల్లా స్థాయి కబడ్డీ ప్రారంభం
పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలో స్థానిక నాయకులు శివ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను శనివారం జూపల్లి అరుణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవాటుగా చేసుకోవాలని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. చంద్రయ్య, దండు నరసింహ, గోపాల్ రావు, ఆరేపల్లి అర్జున్ యాదవ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్