నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రఘు ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్లు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ రఘు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజంలోని రుగ్మతల నిర్మూలన కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప దార్శనికుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ యాదగిరి, డాక్టర్ అజయ్, సిబ్బంది పాల్గొన్నారు.