కల్వరాల గ్రామానికి చెందిన బండారి చెన్నమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 60,000 విలువగల చెక్కును మంగళవారం పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు కొండంత అండని అని తెలిపారు. బాధితులు మంత్రి జూపల్లి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.