అమరగిరి పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన ఎంఈఓ

68చూసినవారు
అమరగిరి పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన ఎంఈఓ
కొల్లాపూర్ మండలం అమరగిరి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంఈఓ ఇమ్మానుయేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. విద్యార్థులకు ప్రగతి పత్రాలు ఇవ్వాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. పాఠశాల హెచ్ఎం సౌమ్య, సిఆర్పి మహమ్మద్ అలీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్