నాగర్ కర్నూల్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం డీవైఎఫ్ఐ యువజన సంఘం ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ హాజరై ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ వర్మ, సైదులు, శివశంకర్, నాగపూర్ సైదులు పాల్గొన్నారు.