నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి బుధవారం అస్సాం రాష్ట్రంలోని గాహుతీలో పరిశ్రమల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ బ్యాంకు అధికారులు యువతకు ఎటువంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. బ్యాంకుల ప్రోత్సాహం యువతకు కొండంత అండ అని సూచించారు. బ్యాంకు అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.