నాగర్ కర్నూల్: కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

73చూసినవారు
నాగర్ కర్నూల్: కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయంలోని 102 నెంబర్ గల గదిలో బుధవారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ వెంకట దాస్ తెలిపారు. కంటి సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ ను వెంట తీసుకురావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్