పెంట్లవెల్లి: మంత్రి జూపల్లి నిధులతో మంచినీటి కోసం బోర్లు

63చూసినవారు
పెంట్లవెల్లి: మంత్రి జూపల్లి నిధులతో మంచినీటి కోసం బోర్లు
పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం, వేంకల్లు గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి జూపల్లి ఎమ్మెల్యే నిధుల నుండి రూ. 5 లక్షలు మంజూరు చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు బుధవారం శేఖర్ రాజ్ కుమార్ చిన్న ఈశ్వరయ్య సహకారంతో వారి భూమిలో బోర్లు వేయించారు. నీళ్లు పుష్కలంగా రావడంతో ప్రజలు మంత్రి జూపల్లి కి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్