అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను కాంగ్రెస్ అధిష్టానం టిపిసిసి ఉపాధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా అచ్చంపేట తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతల రాజగోపాల్ ఎమ్మెల్యే వంశీకృష్ణను శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, నీతి నిజాయితీని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అచ్చంపేట ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.