పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 166 177లో గల భూములను ఫారెస్ట్ అధికారులు ఈశ్వర్, ఎమ్మార్వో జీకే మోహన్ తో కలిసి మంగళవారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో జీకే మోహన్ మాట్లాడుతూ తుంగరేగుల భూములను సర్వే చేసి పై అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. రైతులు అప్పటివరకు రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.