వంగూర్ మండలం పరిధిలోని కొండారెడ్డిపల్లి రైతువేదికలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ఉంటుందని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రియదర్శిని ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం గురించి ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.