వనపర్తి పట్టణంలోని 24వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గజరాజుల తిరుమలేష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్లును కలిసి పలు సమస్యలను విన్నవించారు. పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీటి సరఫరాలో సమస్యలు నెలకొన్నాయని, పాడైన సీసీ రోడ్లు స్థానంలో కొత్తగా నిర్మించాలని, అదేవిధంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందేవిధంగా చూడాలన్నారు.