ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది. ఈ జాతర నేటి రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఈనెల 30వ తేదీన ఆలయం వెనుక ఉన్న పెద్ద దేవతకు పూజలు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది.