అమెరికాలో నల్గొండ అమ్మాయి మృతి

60చూసినవారు
అమెరికాలో నల్గొండ అమ్మాయి మృతి
TG: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి ప్రియాంక (26) అమెరికాలో మృతి చెందింది. దంత సమస్యతో బాధపడుతున్న ప్రియాంక ట్రీట్‌మెంట్ కోసం వెళ్లగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని డాక్టర్లు దంతాన్ని తొలగించారు. ప్రాబ్లం ఎక్కువగా ఉందని ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని కోరగా.. రెండు రోజుల సమయం కావాలని అడిగింది. పక్కరోజు బాత్‌రూంలో సృహతప్పి పడిపోగా.. స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో బ్రెయిన్ డెడ్ అయి మరణించింది.

సంబంధిత పోస్ట్