నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని దొంతినేని నరసింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో జనరల్ విద్యార్థులు 95కు 95 మంది పరీక్షకు హాజరయ్యారని సూపరింటెండెంట్ జుర్రు పాండురంగయ్య గురువారం తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 135 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 104 మంది హాజరయ్యారని 27 మంది గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.