చందంపేట: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని పిఎసిఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి ఆన్నారు. శనివారం పోలేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.