చింతపల్లి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడొద్దని, అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని కస్తూర్బా సిబ్బందికి ఎమ్మెల్యే బాలు నాయక్ సూచించారు. గురువారం చింతపల్లిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఎమ్మెల్యే అకస్మికంగా తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, సిరాజ్ ఖాన్, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.